Politics23rd Oct 12:03 PMSunil Byrisetty1 min read
రాష్ట్రపతి, సీజేఐ, సీఈసీకి ఎంపీ గురుమూర్తి లేఖ
స్థానిక సంస్థల ఎన్నికల వేళ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను ఎన్నికల విధుల నుంచి వెంట
స్థానిక సంస్థల ఎన్నికల వేళ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డీవోపీటీ, గవర్నర్‌లకు ఆయన లేఖ రాశారు. కూటమి శ్రేణులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నాయని ఎంపీ ఆరోపించారు. పుంగనూరు, పులివెందుల, కమలాపురం, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో అభ్యర్థులపై దాడులు జరిగాయని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో పక్షపాత వైఖరి కారణంగా ఈసీ బదిలీ చేసిన డీఐజీ కోయా ప్రవీణ్‌ను మళ్లీ ఎన్నికల విధుల్లోకి తీసుకోవడం నిబంధనల ఉల్లంఘన అని గుర్తుచేశారు. పోలీసుల పక్షపాతం, హైకోర్టు ఆదేశాల అమలు వైఫల్యంపై సీసీటీవీ విజువల్స్ ఆధారంగా స్వతంత్ర విచారణ జరిపించాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని ఎంపీ గురుమూర్తి కోరారు.