Politics20th Jul 03:32 PMSunil Byrisetty1 min read

వారంతా వైసీపీ పోలీసులేనా?!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిపైనే గడిచినా కొందరు అధికారులు వైసీపీకే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 199 మంది పోలీసులకు పోస్టింగులు, జీతాలు ఇవ్వడం

వారంతా వైసీపీ పోలీసులేనా?!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిపైనే గడిచినా కొందరు అధికారులు వైసీపీకే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 199 మంది పోలీసులకు పోస్టింగులు, జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి.. ప్రధాని దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరికీ లేఖలు రాశారు. వీరిలో ఐపీఎస్ అధికారులు నలుగురే ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అంటే జగన్ సేవలో మునిగితేలి.. అప్పటి ప్రతిపక్ష నేతలను వేధించిన వారంతా ఇప్పుడు పోస్టింగులు తెచ్చుకున్నారు. నలుగురు ఐపీఎస్‌లకు మాత్రమే పోస్టింగులు రాలేదు. అలాగే 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు , 119 మంది సీఐలు ఈ జాబితాలో ఉన్నారని వీరందర్ని వీఆర్‌లో ఉంచారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ కోసం ఏది చెప్పినా, రూల్స్ కు వ్యతిరేకమైనా పని వారేనని చెబుతున్నారు. వైసీపీ హయాంలో కూడా ఈ సంఖ్యకు మించి వీఆర్ లో పోలీసులను ఉంచారని టీడీపీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తోంది. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్లకు పోస్టింగులు లేకపోవడానికి కారణాలు కూడా లేఖలో రాస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
Andhra Pradesh news
ap politics
YSRCP
TDP
Police Postings
MP Gurumurthy
IPS Officers
Political Allegations
VR Police
Administration Controversy
199 మంది పోలీసులకు పోస్టింగులు
Scroll for the next article