News9th Sep 11:24 AMSunil Byrisetty1 min read

వైసీపీ ఎంపీల బాధ్యతా రామ్మోహన్ దే!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎన్డీఏ కూటమికి పడాల్సిన ఓట్ల బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. మొత్తం ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఓ

వైసీపీ ఎంపీల బాధ్యతా రామ్మోహన్ దే!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎన్డీఏ కూటమికి పడాల్సిన ఓట్ల బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. మొత్తం ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఓటింగ్ ఏజెంట్లుగా నియమించింది. వారిలో రామ్మోహన్ ఒకరు. దక్షిణాది నుంచి ఎన్డీఏ ఓటర్లందర్నీ ఆయన సమన్వయం చేస్తారు. ఓ రకంగా తాము ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశామని ఏజెంట్ కు నమ్మకం కలిగేలా చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారందరి సంగతేమో కానీ.. వైసీపీ ఎంపీలు కూడా.. రామ్మోహన్ కిందకే వస్తారు. వైసీపీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఓటు వేయనున్నారు. ఎవరికి ఓటేశారో తర్వాత బీజేపీ నాయకత్వానికి నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది.
South India Politics
YSRCP
Ram Mohan Naidu
NDA
Vice Presidential Election
BJP
Parliament
Voting Coordination
Rajya Sabha
Lok Sabha
ఉపరాష్ట్రపతి ఎన్నిక
దక్షిణాది
బీజేపీ
పార్లమెంట్
Scroll for the next article