Politics7th Oct 04:23 PMSunil Byrisetty1 min read

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే వైయస్సార్సీపీ తమ తొలి అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు నగర మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు వైయస్‌ఆర్‌సీ

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే వైయస్సార్సీపీ తమ తొలి అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు నగర మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ కష్టకాలంలోనూ విధేయంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయమని వారు తెలిపారు. ఓసీ జనరల్‌ రిజర్వేషన్‌ వస్తే విజయమే లక్ష్యంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని సూచించారని చెప్పారు. ఒకవేళ రిజర్వేషన్‌ అయినా కూడా, బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నెల్లూరు నగరంలో 72 డివిజన్లు ఉన్నాయన్నారు. ఇలాంటి కీలకమైన కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఉండాలనేదే తమ ఆలోచన అని చెప్పారు.
Scroll for the next article