Politics20th Sep 05:16 PMSunil Byrisetty1 min read

331 మందితో ప్రతినిధుల బృందం సిద్ధం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. పార్టీని ప్రక్షాళన చేస్తూ, ప్రతి విభాగంలోన

331 మందితో ప్రతినిధుల బృందం సిద్ధం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. పార్టీని ప్రక్షాళన చేస్తూ, ప్రతి విభాగంలోనూ క్రియాశీలక నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడలో ఆయన కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ, యూత్, మహిళా విభాగాలు, సచివాలయాల వారీగా 331 మంది ప్రతినిధులతో ఒక బలమైన బృందాన్ని సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయిలో పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. *ఈ నెల 23 నుంచి ఇంటింటి ప్రచారానికి జగనన్న ఆదేశం* పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచనల మేరకు గుమ్మం గుమ్మం తిరిగేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Scroll for the next article