Politics9th Jun 05:28 PMSunil Byrisetty1 min read

డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ వివాదం

టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అని

డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ వివాదం
టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయని అన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు పాలనపై పౌరసమాజం, పాత్రికేయలోకం, మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. ఏడాది పాలన వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారని చెప్పారు. మరోవైపు మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, పోలీసుల దాష్టీకం, అధికారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలంటే ఇటువంటి వివాదాలు టీడీపీకి కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
politics
kommineni arrest
sajjala press meet
illegal arrest
freedom of press
డైవర్షన్‌ పాలి'ట్రిక్స్‌
Scroll for the next article