Politics6th Sep 04:11 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల్ని మోహరించాలి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల్ని మోహరించాలి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠాకు లేఖ రాశారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, అధికార యంత్రాంగం దుర్వినియోగం, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల జోక్యం, బెదిరింపుల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత అవసరమని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ఆధారాలు, వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుల్ని సైతం అప్పిరెడ్డి తన లేఖకు జత చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. 2025 ఆగస్టు 13న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని సుమారు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరించడం, రిగ్గింగ్, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం వంటి ఘటనలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు.
Andhra Pradesh Local Elections
YSRCP
Lella Appireddy
Local Body Elections
CAPF Forces
Central Forces
State Election Commission
అనిల్ చంద్ర పునేఠా
ఏపీ రాజకీయాలు
కడప ఎన్నికలు
పులివెందుల
ఒంటిమిట్ట
ఎన్నికల భద్రత
Scroll for the next article