Politics9th Jul 04:48 PMSunil Byrisetty1 min read
టెట్ విషయంలో వైసీపీ బురదజల్లుతోంది
టెట్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు తెలిసి కూడా వైసీపీ కావాలనే బురదజల్లుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న
టెట్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు తెలిసి కూడా వైసీపీ కావాలనే బురదజల్లుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన మానసిక పరిస్థితి రాష్ట్ర ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. గత రెండు రోజులుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, అంజుమన్ ఇషాత్ ఎ తలీమ్ ట్రస్ట్ మధ్య రేగిన వివాదంపై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ల ధర్మాసనం ఒక అసాధారణ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి.. 2011 కంటే ముందు ఎంపికైన ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసిందన్నారు. లేని పక్షంలో వారిని విధులనుంచి తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.