News8th Jul 02:03 PMSunil Byrisetty1 min read
ఆర్కిటెక్చర్ విద్యార్థులుక జగన్ భరోసా
కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థులు కలిశారు. కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్ జగన్‌ను క
కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థులు కలిశారు. కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్ జగన్‌ను కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇడుపులపాయలో వైయస్ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైయస్ జగన్ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది’’ అని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.