News26th Jul 12:12 PMSunil Byrisetty1 min read

విద్యార్థులు, యువతతో 28న నిర‌స‌న

విద్యార్థి, యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న వైఎస్సార్సీపీ తలపెట్టిన నిర‌స‌న ర్యాలీ కార్యక్రమంపై పక్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులకు ప

విద్యార్థులు, యువతతో 28న నిర‌స‌న
విద్యార్థి, యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న వైఎస్సార్సీపీ తలపెట్టిన నిర‌స‌న ర్యాలీ కార్యక్రమంపై పక్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులకు పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలపై జరిగిన ఆందోళనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలో డీఎస్సీ భర్తీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీఎస్సీ నియామ‌కంలో స్పోర్ట్స్ కోటా కింద చెల్లుబాటు కాని సర్టిఫికెట్లతో దాదాపు 400 పోస్టులు కేటాయించడం, ఎగ్జామినర్, కన్వీనర్ బాధ్యతలను ఒకే వ్యక్తికి ఇచ్చి, ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగితో నడిపించి అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలతో పాటు రూ. 10వేల కోట్లకు పైగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగుల‌కు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకపోవడంపై నిరసన గళం విప్పాలని చెప్పారు. పార్టీ శ్రేణులతో పాటు తటస్థ విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన సంఘాలను కలుపుకొని ప్రతి జిల్లాలో వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Education Department
YSRCP
Sajjala Ramakrishna Reddy
Student Protest
Youth Protest
DSC Recruitment
నిరుద్యోగ భృతి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
నిరసన ర్యాలీ
Scroll for the next article