Politics30th Oct 06:19 PMSunil Byrisetty1 min read
ఎన్నికలు సజావుగా నిర్వహించాలని వైసీపీ వినతి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లీగల్ సెల్ నేత మనోహర్ రెడ్డి తదితరులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, బందో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లీగల్ సెల్ నేత మనోహర్ రెడ్డి తదితరులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ తదితరాలపై మరోసారి విజ్ఙప్తి చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేసేలా చూడాలని ఎస్ఈసీని కోరారు. ఇదే అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 150 రిప్రజెంటేషన్లు ఎస్ఈసీకి ఇస్తే వాటిని ఫార్వార్డ్ చేసి వదిలేశారే కానీ పరిశీలించి, పరిష్కరించలేదని ఆరోపించారు. ఎస్ఈసీని కలిసిన అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదన్నారు. ఆధారాలతో కూడిన ఆరోపణలు సమర్పించినా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మారిందని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు సైతం టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని 2 సార్లు ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకోలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో 60 వేల నుంచి 70 వేల మందిని బందోబస్తులో నియమిస్తారు. కానీ ఈసారి సగానికి తగ్గించి 12224 పోలింగ్ బూత్ లు ఉంటే కేవలం 36351 మందిని పోలీస్ బందోబస్తు నియమించినట్లు ఎస్ఈసీ తెలిపిందని చెప్పారు. బూత్ క్యాప్చరింగ్ చేయడానికే ఇలా బందోబస్తును తగ్గించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఓటర్లకు బందోబస్తు కల్పించాలని చెప్పినా ఎస్ఈసీ పట్టించుకోదా? సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని కోర్టులు చెప్పినా ఏర్పాటు చేయలేదని విమర్శలు చేశారు.