Politics2nd Jun 09:48 AMSunil Byrisetty1 min read
వెన్నుపోటు దినంను విజయవంతం చేద్దాం!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. కౌన్సిలర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలతో కలసి జోగి రమేష్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే రూ 1.50 లక్షల కోట్లు అప్పులు చేసినప్పటికీ,ఏ ఒక్క సంక్షేమ,అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని,అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 90 శాతం ఎన్నికల హామీలను అమలు పరచి ప్రజలకు సంక్షేమ,అభివృద్ధి ఫలాలను అందించిందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సిపి శ్రేణులు కలసికట్టుగా విజయవంతం చేద్దామని కోరారు.