Politics15th Jul 11:04 AMSunil Byrisetty1 min read

జగన్ ఇంటి వద్ద గుమ్మడి కాయలతో దిష్టి

జగన్ ఎక్కడ పర్యటన కు వెళ్ళినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయంటూ వైసీపీ నేతలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మాజీ సీఎం జగన్ మోహన రెడ్డి నివాసం వద్ద బరిగల కోటేష్, లీగల్ సెల్ నాయకుల

జగన్ ఇంటి వద్ద గుమ్మడి కాయలతో దిష్టి
జగన్ ఎక్కడ పర్యటన కు వెళ్ళినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయంటూ వైసీపీ నేతలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మాజీ సీఎం జగన్ మోహన రెడ్డి నివాసం వద్ద బరిగల కోటేష్, లీగల్ సెల్ నాయకులు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు మహిళా నేతలతో గుమ్మడి కాయలు కొట్టారు. జగన్ పర్యటనలో జన ప్రభంజనం చూసి కూటమి నాయకులు తట్టుకోలేక, దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నర దిష్టి, కూటమి పాలకుల దిష్టి పోవాలని జగన్‌కు ఎప్పుడూ తాము అండగా ఉంటామని మహిళా నేతలు అన్నారు.
Andhra Pradesh news
Ap politics
ycp
Ys jagan
ys jagan house
ysrcp women
జగన్ ఇంటి వద్ద గుమ్మడి కాయలతో దిష్టి
Scroll for the next article