Politics8th Sep 01:08 PMSunil Byrisetty1 min read

స్కాముల పోటీ పెడితే వైసీపీకి మెడల్ ఖాయం

మెగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16,400 మంది ఉపాధ్యాయ అభ్య

స్కాముల పోటీ పెడితే వైసీపీకి మెడల్ ఖాయం
మెగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16,400 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా.. కొడుకు జగన్మోహన్ రెడ్డి రూ. 43 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి బృందానికి క్రీడల్లో కాకుండా స్కాముల్లో పోటీలు పెడితే దేశంలోనే ఫస్ట్ ప్లేస్ వస్తుందన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భారీ కుంభకోణం కేసులో కుమారుడు మొదటి ముద్దాయిగా ఉన్న చరిత్ర వీరిదేనన్నారు. 2019కి ముందు టీచర్ ఖాళీలపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన జగన్, తన ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేలాది కుటుంబాలకు ఆనందాన్ని ఇస్తుంటే వైసీపీ కడుపుమంటతో రగిలిపోతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారని, ఆ అసూయతోనే డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Somireddy Chandramohan Reddy
Mega DSC
DSC Recruitment
YSRCP
TDP
Teacher Jobs
Jagan Mohan Reddy
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఉపాధ్యాయ నియామకాలు
ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ విద్యా వార్తలు
Scroll for the next article