Politics9th Mar 02:13 PMSunil Byrisetty1 min read

ఆవిర్భావ వేడుకలతో వైసీపీ సత్తా

ఈ నెల 12వ తేదీ వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్తా చాటాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భా

ఆవిర్భావ వేడుకలతో వైసీపీ సత్తా
ఈ నెల 12వ తేదీ వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్తా చాటాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలన్నారు. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలన్నారు. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
YSRCP
Jagan
Sajjala Rama Krishna Reddy
YSRCP Formation day
వైయస్సార్‌సీపీ
జగన్
సజ్జల రామ కృష్ణ రెడ్డి
వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
Scroll for the next article