News25th Oct 04:18 PMSunil Byrisetty1 min read

నెల్లూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

నెల్లూరు వీఆర్సీ సెంటర్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన

నెల్లూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
నెల్లూరు వీఆర్సీ సెంటర్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా గవర్నర్ కి అందించబోయే ప్రతుల మీద పలువురు సంతకాలు చేసి తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు నిరసిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం లెక్కచేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు మెడికల్ కళాశాలలను తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎకరా 100 రూపాయలకు చొప్పున అప్పనంగా కట్టబెడుతూ ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమం చేపట్టేందుకు నిర్ణయించారని తెలిపారు. అందులో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి.. కోటి మంది సంతకాలు చేసిన ప్రతులను గవర్నర్ కి అందించి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం సాగించనున్నామని తెలిపారు.
Andhra Pradesh
politics
protest
Nellore
YSRCP
signature campaign
medical colleges
privatization
YS Jagan
Parvatha Reddy
వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
Scroll for the next article