Politics12th Nov 04:56 PMSunil Byrisetty1 min read

2024 కన్నా వైసీపీ ఓటింగ్ పెరిగింది

వైఎస్ జగన్ ను కలిసిన పలు జిల్లాల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరుపై చర్చించారు. పార్టీ కేడర్ అంతా గట్టిగా పోరాటం చేశారని, చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని అన్నారు. 202

2024 కన్నా వైసీపీ ఓటింగ్ పెరిగింది
వైఎస్ జగన్ ను కలిసిన పలు జిల్లాల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరుపై చర్చించారు. పార్టీ కేడర్ అంతా గట్టిగా పోరాటం చేశారని, చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే YSRCP ఓటింగ్ శాతం పెరిగిందని అభిప్రాయపడ్డారు. కూటమి అరాచకాలు, అన్యాయాలు చేసినా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే భారీ ఓట్ పర్సంటేజ్ వచ్చేదని నేతలు అన్నారు. తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే బాబు అరాచకాలు చేశారని విమర్శించారు. ఎన్నికల అక్రమాల్లో బాబు సరికొత్త ఆవిష్కరణలు తెచ్చారని, YSRCP గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేశారని వ్యాఖ్యానించారు. దుర్మార్గాలు చేసి ఇప్పుడు బాబు నీతులు చెప్పడం విడ్డూరమని వైఎస్ జగన్ నేతలతో పేర్కొన్నారు.
Scroll for the next article