News15th May 11:34 AMSunil Byrisetty1 min read

యుక్తధార్ యాప్.. కేంద్రం ఆధీనంలోకి ఉపాధిహామీ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాల్లో పనులు జరుగుతుంటాయి. అయితే ఆ పనుల్లో తరచుగా పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పని దినాలు, పనివారి లెక్కల్లో తప

యుక్తధార్ యాప్.. కేంద్రం ఆధీనంలోకి ఉపాధిహామీ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాల్లో పనులు జరుగుతుంటాయి. అయితే ఆ పనుల్లో తరచుగా పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పని దినాలు, పనివారి లెక్కల్లో తప్పులు చూపి, కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. దీంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ సైతం ఉండకుండా కేంద్రమే ఈ పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తోంది. అయితే, నిధుల ఖర్చు, పనుల గుర్తింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది. పథకంలో అక్రమాలు అరికట్టి పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా 'యుక్తధార్‌' పేరిట యాప్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలోని 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 చోట్ల 'యుక్తధార్‌' పోర్టల్‌ ద్వారా ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు.
Central Government
Yuktha App Released
National Rural Employment Guarantee Scheme
Yuktadhara
ఉపాధి హామీ
కేంద్రం ఆధీనంలోకి ఉపాధిహామీ
Scroll for the next article