News2nd Oct 05:31 PMSunil Byrisetty1 min read

యువగళం హామీ.. నెరవేరింది ఇలా!

యువనేత నారా లోకేష్ రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అ సమయంలో రాయలసీమ రైతులను కలిసి, వారు పడుతున్న ఇబ్బందులను చూస

యువగళం హామీ.. నెరవేరింది ఇలా!
యువనేత నారా లోకేష్ రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అ సమయంలో రాయలసీమ రైతులను కలిసి, వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. 'కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాన'ని ఆనాడు సీమ రైతాంగానికి భరోసా ఇచ్చారు. హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమను మారుస్తామని, సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీనీ, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని, 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తామని తెలిపారు. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ పోర్టు చేసే విధంగా కొత్తరకం విత్తనాలు, మొక్కలు సృష్టించేందుకు హార్టికల్చర్ రీసెర్చి సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనాడు ప్రకటించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఆనాడు రాయలసీమ రైతాంగానికి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఈరోజు సాకారం చేసింది. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌-GHHకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు వెచ్చిస్తుంది. ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు రూపొందించారు.
Scroll for the next article