Politics11th Mar 06:13 PMSunil Byrisetty1 min read

'యువ‌త పోరు'తో ప్రభుత్వ కళ్ళు తెరిపించాలి

వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్ద నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైత‌న్య, వ‌ర్కింగ్ ప్రె

'యువ‌త పోరు'తో ప్రభుత్వ కళ్ళు తెరిపించాలి
వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్ద నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైత‌న్య, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ ర‌విచంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. యువతకు ఉపాధి, నిరుద్యోగభృతి అంటూ తీయని మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, నేడు వారి గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు. *వైయ‌స్సార్సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల విడుద‌ల‌, నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని డిమాండ్ పై ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయం చేసేలా ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాల‌ను విద్యార్థిలోకం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా క‌లెక్టరేట్ల వ‌ద్దకు విద్యార్థులు, నిరుద్యోగ‌ యువ‌తతో ర్యాలీగా వెళ్లి నిర‌స‌న కార్యక్రమాలు నిర్వహించిన అనంత‌రం క‌లెక్టర్లకు విజ్ఞాప‌నప‌త్రాలు ఇవ్వడం జ‌రుగుతుంది. వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జ‌రిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టడానికి విద్యార్థులు, యువ‌త భారీగా త‌ర‌లి రావాల’ని వారు పిలుపునిచ్చారు.
YSRCP
Andhra Politics
Yuvatha Poru
ఆంధ్రా రాజకీయాలు
యువత పోరు
Scroll for the next article