News21st Nov 01:06 PMSunil Byrisetty1 min read
సిట్ విచారణలో తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్ప ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ ఈ విచారణ చేపట్టింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు మైసూరు ల్యాబ్ నివేదిక నిర్ధారించినా, కొన్ని కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకు కొనసాగించారని అధికారులు ప్రశ్నించారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డెయిరీలకు 2024 వరకు, భోలే బాబా డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై ప్రశ్నలు సంధించారు. అయితే అంతా అధికారులే చేశారని, తనదేమీ లేదని వైవీ చెప్పినట్లు సమాచారం.