Technology14th Oct 11:49 AMSunil Byrisetty1 min read

మేకిన్ ఇండియా టెక్నాలజీతో.. త్వరలో మరో యూపీఐ

ఇప్పటికే అరట్టై, .జోహోకు రూపకల్పన చేసిన శ్రీధర్ వెంబు డిజిటల్ చెల్లింపుల రంగంపై దృష్టి సారించారు. తాజాగా పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేశారు. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సవాలు విసురుతున్

మేకిన్ ఇండియా టెక్నాలజీతో.. త్వరలో మరో యూపీఐ
ఇప్పటికే అరట్టై, .జోహోకు రూపకల్పన చేసిన శ్రీధర్ వెంబు డిజిటల్ చెల్లింపుల రంగంపై దృష్టి సారించారు. తాజాగా పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేశారు. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సవాలు విసురుతున్న జోహో సంస్థ.. ఫిన్ టెక్ రంగంపై కూడా తన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక డిజిటల్ చెల్లింపుల రంగంలో పాతుకుపోయిన ఫోన్ పే, జీపే, పేటీఎమ్‌కు సవాలు విసిరేందుకు అరట్టై రూపకర్త, జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు సిద్ధమయ్యారు. ఆయన సారథ్యంలోని జోహో తాజాగా పాయింట్‌ ఆఫ్ సేల్ డివైజ్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటి సాయంతో వ్యాపారులు కస్టమర్ల నుంచి నేరుగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు. తన సాఫ్ట్‌వేర్‌ ఎకోసిస్టమ్‌తో ఈ డివైజెస్‌ను ఏకం చేయాలనే వ్యూహంతో సంస్థ ముందుకెళుతోంది. దేశీ యాప్ అరట్టైతో జోహో పే చెల్లింపుల వ్యవస్థను త్వరలో అనుసంధానం చేస్తామని శ్రీధర్ వెంబు తెలిపారు.
Zoho Pay
Arattai
Digital Payments
POS Devices
Fintech India
UPI Challenge
Sridhar Vembu
Digital Payment Innovation
మొబైల్ చెల్లింపులు
దేశీ టెక్నాలజీ
డిజిటల్ పేమెంట్స్ కొత్త పరిష్కారం
Scroll for the next article